logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కార్మికులు భోజనాలు చేయడానికి కనీస సౌకర్యాలు భోజనం చేసే హల్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.. వై. విక్రమ్ సీపీఎం ఖమ్మం జిల్లా నేత....


బైపాస్ కూరగాయల మార్కెట్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి - వై విక్రమ్,మార్కెట్ చైర్మన్ కు CITU ఆధ్వర్యంలో వినతి పత్రం

ఖమ్మం, 26 మార్చి 2026:

ఖమ్మం బైపాస్ రోడ్ పెద్ద కూరగాయల మార్కెట్ లో హమాలి కార్మికులకు కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని CITU ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వై విక్రమ్ డిమాండ్ చేశారు. గురువారం మార్కెట్ చైర్మన్ హనుమంతరావును కలిసి సమస్య లపై చర్చించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ రాత్రి నుంచి ఉదయం 10 వరుకు కార్మికులు చెమట కష్టంతో రాత్రిళ్ళు అంతా పని చేసి భోజనాలు చేయడానికి కనీస సౌకర్యాలు భోజనం చేసే హల్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. త్రాగు నీరు కూడా చాలా సంవత్సరాల నుండి వాడుతున్న వాటర్ ట్యాంక్ అపరిశుభ్రంగా వుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. వున్న మరుగుదొడ్లు సరిపోవడం లేదు అని, విటీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది అని ఆరోపించారు. టూ వీలర్ పార్కింగ్ లేకపోవడంతో మార్కెట్ లోపల అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని తెలిపారు. భోజనం హల్, నూతన మరుగుదొడ్లు ఏర్పాటు, త్రాగు నీరు సౌకర్యం కల్పించడం, టూ వీలర్ పార్కింగ్ తదితర సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి అని డిమాండ్ చేశారు. మార్కెట్ చైర్మన్ హనుమంతరావును మాట్లాడుతూ వచ్చే రెండు నెలల లోపు తగిన నిధులు కేటాయించి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు యర్రా శ్రీనువాసురావు, భుక్యా శ్రీనువాసురావు, బండారు యాకయ్య, బోడపట్ల సుదర్శన్, A మల్లికార్జున్ రెడ్డి, సైదులు, సీతయ్య, సత్యనారాయణ, శ్రీనువాసురావు తదితరులు పాల్గొన్నారు

25
5988 views

Comment