logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్,

పత్రిక ప్రకటన
మార్చి 26, 2026_ఆదిలాబాదు:

బ్యాంకు పర్సన్ ఇన్చార్జ్ రాజర్షిషా అన్నారు. గురువారం స్థానిక సినిమారోడ్ లోని జిల్లా సహకార కేంద్ర ప్రధాన కార్యాలయంలో 98వ మహాజన సభ కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాంకు ఆర్థిక స్థితిగతులు, బడ్జెట్ అంచనాలు, ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకు నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా బ్యాంకు వ్యయ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బ్యాంకు ఖర్చులను తగ్గించి, లాభాల బాటలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ప్యాక్స్ పరిధిలో రుణాల రికవరీ ఆశించిన స్థాయిలో లేని చోట ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రికవరీ రేటును పెంచడం ద్వారానే బ్యాంకు బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో డీసీసీబీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సహకార సంఘాల బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందని వివరించారు. నానో యూరియా స్టాక్ ను అధిక మొత్తంలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు.

​ఈ సమీక్షా సమావేశంలో సీఈఓ రవి కుమార్, జిఎం సూర్య ప్రకాష్, డిఆర్ ఓఎస్డి సింహచలం, సీనియర్ అధికారులు, పిఏసిఎస్ పిఐసి చైర్మన్లు, నాబార్డ్, బ్యాంకు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

0
46 views

Comment