చిత్రం భళారే విచిత్రం...
" దానవీరశూర కర్ణ "లోని - చిత్రం భళారే విచిత్రం...- అంటూ దుర్యోధనునికి, భానుమతికి మధ్య సాగే యుగళ గీతంలోని పల్లవిని సినిమా టైటిల్ గా పెట్టి నైజాంఏరియాకు చెందిన సాయిరాం డిస్ట్రిబ్యూషన్ వారు𝐏𝐍రామచంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన సినిమా " చిత్రం భళారే విచిత్రం "..
'అషిహి భన్వా భన్వి' అనే మరాఠీ చిత్రానికి తెలుగు రీమేక్.
తర్వాత కన్నడలో ‘బంబాట్ హెండ్తీ’ తమిల్ లో ‘అనళగన్’ గా రూపొంది అక్కడివారిని అలరించింది. 𝟏𝟗𝟔𝟔 లో వచ్చిన "బీవీ ఔర్ మకాన్ " హిందీ సినిమా కూడా ఇదే కధాంశం.
𝟏𝟗𝟗𝟏 జూన్ 𝟕 విడుదలై అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని , హైదరాబాద్ దీపక్ లో నేరుగా 𝟏𝟕𝟓రోజులు ప్రదర్శితమై ఆయేడాది సిల్వర్ జూబ్లీ మూవీస్ లో ఒకటిగా నిలచింది. నరేష్ కు నంది స్పెషల్ జ్యురీ అవార్డు తో పాటు బ్రహ్మానందం హాస్యనటుడిగా " నీ యంకమ్మ "అంటూ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు.ఈసినిమా విజయంతో కొద్దిమందినటులు లేడీగెటప్ తో నరేష్ లా అలరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. హీరో నరేష్ ఆడ మనిషి వేషంలో అచ్చు వాళ్లమ్మ విజయనిర్మలను తలపించాడని చెప్పొచ్చు.
పరభాషకు చెందినకధను 𝐏సాంబశివరావు తెలుగునేటివిటీ కి తగ్గట్లు కొద్దిపాటి మార్పులతో వ్రాయగా , తోటపల్లి మధు కితకితలు పెట్టేలా మాటలు వ్రాసారు. ముఖ్యంగా నరేష్ లేడీ గెటప్ ,బ్రహ్మానందం దేవుడిబొమ్మను చూస్తే ప్రవర్తించే తీరు ,
వృద్ధుడి గెటప్లో రక్తకన్నీరు నాగభూషణం గారిలా మాట్లాడే తీరు , ఆయనకు జోడిగా బొద్దుగా ఉండే తిండిపోతు లవర్, వీరివురి తిండిగోల కామెడీ .......కడుపుబ్బ నవ్విస్తాయి
కధలోకివస్తే......పట్నంలో ఉద్యోగంచేసే మిత్రుడు సుధాకర్ దగ్గరకు నరేష్ , రాఘవ, బ్రహ్మానందం చేరుతారు. అందరికీ ఆశ్రయమిచ్చిన సుధాకర్ , ఇంటి ఓనర్ కు తెలియకుండా, అతనికున్న మధుమేహ వ్యాధికి ఇజ్రాయిల్ నుండి మందు తెప్పిస్తాననే మాయమాటలు చెప్పి మైంటైన్ చేస్తుంటాడు . చివరకు ఒకేగదిలో నలుగురున్నట్టు ఇంటి ఓనర్ కు తెలిసి పోతుంది. ఓరోజు నలుగురు తప్ప తాగి గొడవ చేయగా బయటకు గెంటేస్తాడు.
బ్యాచలర్స్ కు కొంప అద్దెకివ్వడం ఎంత కష్టమో , ఆభాధ అనుభవించినోళ్ళకే తెలుస్తుంది.చెన్నై పల్లవరం ఏరియాలో సుమారు 𝟔 నెలలు రూమ్ దొరక్క మా బ్యాచ్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు...చివరకు తాంబరం లో ముత్తు అనే హోటల్ యజమాని మాకష్టాలు చూసి హోటల్ పై రూమ్ అద్దెకిస్తే అక్కడే ఫుడ్డు - బెడ్డు ఏడేండ్లు సాగింది. అతని పూర్వీకులు మన తెలుగోళ్లు కావడం మాకు ప్లస్ పాయింట్. డబ్బులు వెనక ముందు ఇచ్చిన పల్లెత్తి ఓమాట అడిగేవాడు కాదు
కధలోకి వస్తే.... ఆసమయంలో ఈ బ్రహ్మచారులకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. ఓచోట
ఫ్యామిలీకి మాత్రమే ఇల్లు ఇస్తామని మగదిక్కు లేని ఓఇంటి ఓనర్ కండీషన్ పెడుతుంది .పార్కుల్లో రోడ్డుపక్కన ఉంటూ
బేజారైన నరేష్ వేరేదారిలేక తన బుద్ధిబలంతో సుధాకర్ భార్యగా అమ్మాయి వేషం కడతాడు. సుధాకర్ తండ్రిగా బ్రహ్మానందం,తమ్మునిగా రాఘవ ఇంట్లో చేరుతారు. ఆఇంటి ఓనర్ కూతురు రాజీవిని ప్రేమిస్తాడు. ప్రేమకోసం మగాడిలా, ఇంటి కోసం అమ్మాయిలా వేషాలు మార్చుకుంటూ పడే తంటాలు అన్ని ఇన్ని కావు . సుధాకర్ ను అతను పనిచేసే ప్రెస్ లేడీ బాస్ ప్రేమిస్తుంది. అయితే అతనికి పెళ్ళయిందని తెలిసి, వీరి ప్రేమ దారితప్పుతుంది. అన్నిటినీ ఒకేరూటులో పెట్టి సర్దుబాటుచేసి , అసలువిషయం బయటపెట్టడంతో ఎవరికి నచ్చిన వారిని వారు పెళ్ళాడడంతో కథ నవ్వులతో ముగుస్తుంది.
విద్యాసాగర్ సంగీతంలో రూపొందిన పాటలు బాగుంటాయి. పై తారాగణముతో పాటు.......... అద్దె ఇంటి ఓనర్ గా కోట శ్రీనివాసరావు , సుధాకర్ లేడీ బాస్ గా తులసి , నరేష్ బాస్ గిరిబాబు , ఆయన కూతురిగా తిండిపోతు పాత్రలో బిందు ఘోష్ , నరేష్ నాయనమ్మగా రాధా కుమారి , రెండో ఇంటి ఆడఓనర్ గా అత్తిలిలక్ష్మి , ఆఇంటి పనిమనిషిగ చిట్టిబాబు,
అత్తిలి లక్ష్మి మేనల్లుడిగా తూచ్ అంటూ కేకలు వేసే కామెడీ విలన్ గా జయప్రకాశ్ రెడ్డి.....తదితరులు నటించిన యూ ట్యూబ్ లో ఉంది........
చూడని , చూసినవారు కూడా ఓసారి వీలైతే చూడండి...
ఆరోగ్యానికి నవ్వు కూడా ఓ మందులాంటిది...