logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రతి సమస్యా పరిష్కరిస్తా...రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి

శ్రీకాకుళం: గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి అన్నారు.బుధవారం సీతంపేట, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఏజెన్సీలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత సీతంపేట ఏరియా ఆస్పత్రిని కమిషన్‌ సభ్యులు గుర్ల సునీత, కడ్రక మల్లేశ్వరరావు, ఐటిడిఎ పిఒ పవార్‌ స్వప్నిల్‌ తో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన చైర్మన్‌.. రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లతో చర్చించారు.

సిబ్బంది కొరతతో పాటు మరికొన్ని మౌలిక వసతుల అవసరం ఉందని వైద్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సేవలపై చైర్మన్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. ఐటిడిఎ ద్వారా అవసరమైన వసతులను కల్పించి, సిబ్బంది కొరతను తీర్చి, గిరిజనులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తొలుత ఐటిడిఎ కార్యాలయ ఆవరణలో అడవి తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఎన్‌టిఆర్‌ అడ్వెంచర్‌ పార్కును సందర్శించారు. బోటు షికారు చేశారు. సీతంపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. గిరిజనుల నుంచి వినతుల స్వీకరణ ఐటిడిఎ సమావేశ మందిరంలో గిరిజనుల నుంచి చైర్మన్‌ బొజ్జిరెడ్డి వినతులను స్వీకరించారు.

సీతంపేటలో గిరిజన భవన్‌ ఏర్పాటుచేయాలని, శ్రీకాకుళంలోని గిరిజన భవనాన్ని ఆదివాసీ సంఘాలకు అప్పగించాలని, జిసిసి షాపుల అక్రమ లీజులపై చర్యలు తీసుకోవాలని వినతులు అందాయి. వారి సమస్యలపై చైర్మన్‌ సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కార్యక్రమంలో డిఎస్‌పి ఎం.రాంబాబు, తహశీల్దార్‌ శ్రీకన్య, ఎంపిడిఒ బిబి మిశ్రో, ఎపిఒ చినబాబు, డిడి అన్నదొర, సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు, డిప్యూటీ డిఇఒ నారాయడు, తదితరులు పాల్గొన్నారు.ఆశ్రమ పాఠశాల సందర్శన గుమ్మలకీëపురం మండలంలోని కెడి కాలనీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను చైర్మన్‌ బొజ్జిరెడ్డి సందర్శించారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఎగ్జిబిషన్‌ను తిలకించి, విద్యార్థినుల సృజనాత్మకతను అభినందించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఒ వాటర్‌ ప్లాంట్‌ను చైర్మన్‌ ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి చైర్మన్‌, సభ్యులు సహఫంక్తి భోజనం చేశారు. వంటల నాణ్యతను పరీక్షించి, విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో 47 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని, తగినంతమంది నైట్‌ వాచ్‌మెన్లు, కుక్‌లు, కమాటీలు, ఆరోగ్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందిగా ఉంటుందని ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గుణద గిరిజన గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గ్రామంలో బహిరంగ సభ జరుగుతుండగా అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికులు గొడుగులు ఏర్పాటు చేయడంతో చైర్మన్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై వినతులను చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చి అందించారు. అనంతరం ఎల్విన్‌పేటలో గిరిజన సామాజిక భవన నిర్మాణాన్ని స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కురుపాం ఎఎంసి చైర్‌పర్సన్‌ కడ్రక కళావతి, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి బిడ్డిక పద్మావతి, ట్రైకార్‌ డైరెక్టర్‌ పువ్వల లావణ్య, టిడిపి మండల కన్వీనర్‌ అడ్డాకుల నరేష్‌, గిరిజన సంక్షేమ శాఖ డిడి విజయశాంతి, ఎంపిడిఒ ఎల్‌ శ్రీనివాసరావు, తహశీల్దార్‌ శేఖరం సిఐ హరి, ఎస్‌ఐ బిడ్డిక శివప్రసాద్‌ పాల్గొన్నారు.

0
233 views

Comment