రోలుగుంట మండలంలో 7-9 తరగతి విద్యార్థులకు ఉచిత IIT-NEET కోచింగ్ ప్రవేశ పరీక్ష
అనకాపల్లిజిల్లా, రోలుగుంట మండలం: మండల చుట్టుపక్కల గ్రామాల్లో చదువుతున్న 7, 8, 9 తరగతి విద్యార్థులకు శుభవార్త. ఢిల్లీలో అత్యున్నత స్థానంలో ఉన్న ఫిజిక్స్ వాలా (5 కోట్ల మంది విద్యార్థులు), సమర్పణ, వేద విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆదివారం శ్రీ విజ్ఞాన్ స్కూల్‌లో ఉచిత IIT, NEET కోచింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.సమర్పణ ఫౌండర్, IPS అధికారి కిల్లాడ సత్యనారాయణ, OBC జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు (వేద విద్యా డైరెక్టర్) సమక్షంలో పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థులు హాజరు కావాలి. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి న 50 మంది విద్యార్థులకు పూర్తిగా ఉచిత కోచింగ్ అందిస్తారు.మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు చెవ్వాకుల భాస్కరరావు (964012024)ను సంప్రదించవచ్చు.