logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

స్టార్టప్ ప్రణాళిక మరియు లీగల్ & ఎథికల్ దశలు” పై అవగాహన సదస్సు.

పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండలం నెరవాడ గ్రామ పరిధిలోని శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో స్టార్టప్ ప్రణాళిక మరియు లీగల్ & ఎథికల్ దశలు” అనే అంశంపై ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించార్.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ప్రొఫెసర్ పి. బిందు స్వేత, డీన్ – CIIE, స్టార్టప్ ప్రణాళికపై విస్తృతంగా వివరణ ఇచ్చారు. ఆమె తన ప్రసంగంలో విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని (Industry Readiness) ప్రత్యేకంగా ప్రస్తావించారు.అదేవిధంగా, స్టార్టప్ ప్రారంభంలో లీగల్ విధానాలు మరియు నిబంధనలను తెలుసుకోవడం కూడా ఎంతో అవసరమని ఆమె వివరించారు.ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలతో కలసి పనిచేయడం ద్వారా స్టార్టప్ విజయాన్ని సాధించవచ్చని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కెరీర్ మార్గదర్శకత్వాన్ని అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ఆయన ప్రత్యేకంగా ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమానికి డా. జి. సౌమ్య, డీన్ – R&D మరియు IIC కన్వీనర్‌గా వ్యవహరించారు. ఆమె తన ప్రసంగంలో పరిశోధన, ఆవిష్కరణలు మరియు స్టార్టప్ సంస్కృతి ప్రాముఖ్యతను వివరించారు.ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమతి పావని,ఈకార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

0
239 views

Comment