బిర్యానీ ప్రేమికులకి కొత్త అడ్రెస్ – ‘మేఘన బిర్యాని’ గ్రాండ్ ఓపెనింగ్ ఘనంగా
నెల్లూరులో బిర్యానీ ప్రియులకు కొత్త రుచిని అందిస్తూ “మేఘన బిర్యాని – ప్యూర్ హైదరాబాద్ స్టైల్” సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. జనసేన పార్టీకి చెందిన ఉద్యమి పనబాక సాయి ప్రారంభించిన ఈ బిర్యాని సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
వాహబ్ పేటలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ…
“బిర్యానీ అంటే మనసుకు హాయినిచ్చే ప్రత్యేక రుచి. మన ముస్లిం సోదరులు అందించే అసలైన రుచికి ఏమాత్రం తగ్గకుండా, అదే టేస్ట్‌తో పనబాక సాయి ‘మేఘన బిర్యాని’లో అందిస్తున్నారు. ఇక బిర్యానీ అంటే ఒక్కటే అడ్రెస్ – మేఘన బిర్యాని అని చెప్పే స్థాయిలో ఉంది. ప్రతివారం రెండు సార్లు తినకపోతే కిక్ మిస్సయ్యేలా ఉంది!” అని అన్నారు.
అలాగే, కొత్తగా ప్రారంభమైన ఈ వ్యాపారాన్ని ప్రజలు ప్రోత్సహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్డర్లు కోసం నేరుగా పనబాక సాయిని సంప్రదించాలని సూచించారు.
పనబాక సాయి, భాస్కర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ బిర్యాని సెంటర్ మంచి విజయాన్ని సాధించి, మరింత విస్తరించాలని కిషోర్ గునుకుల ఆకాంక్షించారు.
“రుచి చూస్తే మరిచిపోలేరు… ఇక బిర్యానీ అంటే మేఘన బిర్యానే!”