logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నెల్లూరు అభివృద్ధికి ప్రజల సహకారం కీలకం – ఎంక్రోచ్‌మెంట్లపై సమతుల్య దృక్పథం అవసరం

నెల్లూరు నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని జనసేన నాయకుడు కిషోర్ గునుకుల కోరారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజన్‌తో నగర రూపురేఖలు మారుతున్నాయని ఆయన తెలిపారు.

పెరుగుతున్న జనాభా, రవాణా అవసరాల నేపథ్యంలో రోడ్డు విస్తరణ, ఎంక్రోచ్‌మెంట్ తొలగింపు వంటి చర్యలు అనివార్యమని పేర్కొన్నారు. 45వ డివిజన్‌లోని ఆత్మకూరు బస్టాండ్ రోడ్ కార్నర్ ప్రాంతాన్ని సందర్శించిన కిషోర్ గునుకుల, అక్కడి చిన్న వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఇప్పటికే రెండు సార్లు ఎంక్రోచ్‌మెంట్ తొలగింపులు జరిగాయని, దీంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కిషోర్ గునుకుల, చిన్న వ్యాపారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం సున్నితంగా వ్యవహరించాలని సూచించారు.

రోడ్డు విస్తరణ అవసరాన్ని అర్థం చేసుకుంటూనే, షట్టర్ వరకు జరిగిన పనుల నేపథ్యంలో అధికారులు స్థలాన్ని పరిశీలించి వ్యాపారులకు అనవసర ఇబ్బందులు కలగకుండా సమతుల్య నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

నగర అభివృద్ధి మరియు ప్రజల జీవనోపాధి రెండూ సమానంగా ముందుకు సాగాలంటే పరస్పర సహకారం అత్యంత అవసరమని కిషోర్ గునుకుల స్పష్టం చేశారు.

0
487 views

Comment