logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లా గ్రామీణ విద్యార్థులకు ఫిజిక్స్ వాలా సహకారంతో మండల స్థాయి IIT-NEET కోచింగ్ ప్రారంభం.

అనకాపల్లి జిల్లా దేశ ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ ఫిజిక్స్ వాలా, సమర్పణ సేవా సంస్థ, వేద విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పూర్వ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10 వేల మంది విద్యార్థులకు తక్కువ ధరలో IIT, NEET కోచింగ్ అందిస్తున్నాయి. ఫిజిక్స్ వాలా స్థాపకుడు అలక్ పాండే అలహాబాద్ సామాన్య కుటుంబంలో పుట్టి, యూట్యూబ్ ద్వారా 5 కోట్ల మంది విద్యార్థులకు చేరువయ్యారు. ఈ సంస్థ ఇటీవల నేషనల్ స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించి, ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చేరింది. . సమర్పణ సేవా సంస్థ స్థాపకుడు కిల్లాడ సత్యనారాయణ పామువాక గ్రామంలో పుట్టి, తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అనకాపల్లి జిల్లా నుంచి తొలి IPS అయ్యారు. 28 సంవత్సరాల సేవ తర్వాత విరమణ తీసుకుని, గ్రామీణ విద్యార్థులకు తక్కువ ధర కోచింగ్ కల్పించాలని సంకల్పించారు. వేద విద్యా సంస్థ ద్వారా పోతల ప్రసాద్ నాయుడు గ్రామీణ విద్యార్థులకు ఫీజు, పుస్తకాలు, సామగ్రి అందిస్తూ ఢిల్లీలో రీడింగ్ రూమ్‌లు నడుపుతున్నారు. కోచింగ్ విధానాలు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్: రూ.8,000స్కూల్ ఇంటిగ్రేషన్ హైబ్రిడ్: రూ.38,000 (ఫిజిక్స్ వాలా ఉపాధ్యాయుల ఆన్‌లైన్ క్లాసులు, సందేహ నివృత్తి) రూ.1.25 లక్షలు (ఫిజిక్స్ వాలా నిపుణులు)కోర్సులు: IIT-JEE (మెయిన్ & అడ్వాన్స్‌డ్), NEET (UG), 8-10 తరగతుల ఫౌండేషన్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, బయాలజీ). ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, కాన్సెప్ట్ ఆధారిత బోధన, 15 రోజులకు పరీక్షలు, సందేహ సెషన్లు, ఆన్‌లైన్ లైబ్రరీ, AI విశ్లేషణ. స్మార్ట్ డిజిటల్ బోర్డులు, స్టేషనరీ, అద్దె, ఉపాధ్యాయులు, ఆఫీసు ఉద్యోగి. ఈయొక్క సంస్థ పర్యవేక్షణలో విద్యార్థులు అనేక సదుపాయాలు పొందవచ్చు. ఇంటి దగ్గరే చదువు, ప్రయాణ ఖర్చు లేదు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

0
436 views

Comment