న్యూఢిల్లీ కేంద్ర ఆరోగ్య శాఖ మాత్యులు జేపీ నడ్డా ను కలిసిన జాతీయ ఆర్ఎంపి పిఎంపి జేఏసీ నాయకులు
AIMA న్యూస్ న్యూడిల్లీ. :
*కేంద్ర ఆరోగ్యశాఖామాత్యులు జేపీ నడ్డా ను కలిసిన జాతీయ ఆర్ఎంపీ,పీఎంపీ జేఏసీ నాయకులు*
న్యూడిల్లీ పార్లమెంట్ భవనం లో కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ జేపీ నడ్డా గారిని,కేంద్ర విమాన శాఖామాత్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్నాయుడు గారి సహాయంతో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు,జాతీయ జేఏసీ గౌరవ అధ్యక్షులు టి జనార్దన్ గారి ఆధ్వర్యంలో జాతీయ జేఏసీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారి సారధ్యంలో జాతీయ పీఎంపీ, ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి జాతీయ స్థాయిలో పీఎంపీ, ఆర్ఎంపీల సమస్యల గురించి వివరించి, జాతీయ స్థాయిలో గుర్తింపు గురించి వివరించడమైనది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కన్వీనర్ వీబీటీ రాజు,ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు,ఏపీ జేఏసీ కన్వీనర్ జీఎస్ ప్రసాద్,ఎమ్ సుధాకర్, జాతీయ జేఏసీ నాయకులు గుజరాత్ నుండి సీఎస్ రావు,షకారియా నవీన్ చంద్ర,తెలంగాణ నుండి పుల్గం మోహన్,ఉత్తర ప్రదేశ్ నుండి ఓపీ మిశ్రా,యోగేష్ జోస్వాల్,బీహార్ నుండి అన్షూ తివారీ, పంజాబ్ నుండి ధన్మాల్ గోయల్,గుస్మైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.