గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
ఆర్థిక నేరాలు, దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలి
అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్ష
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 25 :-
గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
ఆర్థిక నేరాలు, దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలి
అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలి.
ప్రతి వార్డు నందు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి.
రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాలని సూచన.
నమోదైన కేసుల పై పూర్తి స్థాయిలో సమీక్ష.
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను పరిశీలన.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు. ఈరోజు ఉదయం ఆదిలాబాద్ టు టౌన్ పెట్టన పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ, సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. జిల్లాలో, పట్టణంలో గంజాయి లేకుండా ప్రతి ఒక్క సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా ప్రతి వార్డు నందు ప్రజలు స్వచ్ఛందంగా సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. నేరాలు జరగకుండా మరియు జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించడానికి సీసీటీవీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఆర్థిక నేరాలు దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి కేసును నందు శిక్షలు పడే విధంగా దర్యాప్తు కొనసాగించాలని తెలిపారు. తప్పు చేసిన ప్రతి ఒక్క నేరస్తునికి శిక్ష కచ్చితంగా పడేవిధంగా పరిశోధన జరగాలని సూచించారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాలపై, ప్రజలకు హెల్మెట్ యొక్క ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్సైలు పీర్ సింగ్,అఖిల్, విష్ణు ప్రకాష్, డి సి ఆర్ బి ఎస్ ఐ దివ్యభారతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.