logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇంద్రవెల్లి ఏకలవ్య మోడల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా

పత్రికా ప్రకటన
మార్చి 25, 2026_ఆదిలాబాదు:



విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఇంద్రవెల్లి మండలంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతులు, విద్యార్థుల హాజరు పట్టిక, భోజన మెనూ ఆయన పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

అనంతరం వసతి గృహంలో పలువురు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న భోజన నాణ్యతను, వసతి గృహంలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్ భాషా, సబ్జెక్టుపై నైపుణ్యం పెంచుకోవాలని సూచించి, వారిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, పారిశుధ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాల ఆవరణ లోని వాకింగ్ మరమ్మతులు చేపట్టి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

అంతకుముందు పాఠశాలలోని వంట గది, సరుకు నిల్వల గది, భోజన శాల, వసతి గృహాలను పరిశీలించారు. పాఠశాల లో అవసరమైన స్పోర్ట్స్ షూస్, గ్రిజర్స్, ఇతర సౌకర్యాలు, వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలి ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.

ఈ పరిశీలనలో తహసీల్దార్ ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ రేఖ రాణి, డిఈ శివ ప్రసాద్, పిఈటి సరిత, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

12
571 views

Comment