దంతన్‌పల్లి పి.హెచ్.సి లో స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా
పత్రిక ప్రకటన
మార్చి 25, 2026,_ఆదిలాబాదు:
మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రిమ్స్ నుండి వచ్చిన ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆప్తాల్మాలజీ వంటి ఆరు రకాల స్పెషలిస్ట్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు, రక్తహీనత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, వీటి నివారణకు ప్రజలు పరిశుభ…