logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సింహాసనం

తెలుగుసినీరంగంలో ప్రయోగాలకు చిరునామా,సాహసానికి మారుపేరు 'సూపర్ స్టార్ కృష్ణ. తొలితెలుగు జేమ్స్ బాండ్ చిత్రం " గూఢచారి 𝟏𝟏𝟔 " , తొలి తెలుగు కౌబాయ్ చిత్రం "మోసగాళ్లకు మోసగాడు" తొలి తెలుగు సినిమా స్కోప్ "అల్లారి సీతారామరాజు"ని అందించిన ఘనత ఆయనకు దక్కుతుంది. తొలి తెలుగు𝟕𝟎𝐌𝐌...𝟔ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో కృష్ణ మొదటి సారి దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ":సింహాసనం " . 𝟐𝟏, మార్చి 𝟏𝟗𝟖𝟔లో విడుదలై 𝟒𝟎 వసంతాలు పూర్తి చేసుకుంది.
కృష్ణ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో "సింఘాసన్" పేరుతో జితేంద్ర హీరోగా ఏకకాలంలో 𝟔𝟓 రోజుల్లోనే పూర్తి చేశారు. తెలుగులో హిట్ సాధించిన ఈ సినిమా, హిందీలో మాత్రం ఆశించినవిజయాన్నిఅందుకోలేకపోయింది.అప్పట్లో జానపద సినిమాలు వర్కౌట్ అవుతాయా? అందులో కృష్ణ దర్శకత్వమా? అని సినీపరిశ్రమలో చాలామందిసందేహాలు వెలిబుచ్చినప్పటికీ మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లి పోయే కృష్ణ గారు తనపంధా మార్చుకోలేదు. చిత్రంవిడుదలై సూపర్ స్టార్ కృష్ణ ధైర్యానికి, దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యం గా నిల్చింది.
తెలుగు తొలి 𝟕𝟎𝐌𝐌 చిత్రం కావడం తో అప్పట్లో అలాంటి సౌకర్యాలు థియేటర్లలో లేవు , గుంటూరు, విజయవాడ, విశాఖ , హైదరాబాద్ , నెల్లూరు లాంటి నగరాల్లోని కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా స్క్రీన్ మార్పించి సినిమా రిలీజ్ చేశారు. భారీ కటౌట్లు, ప్రత్యేక ప్రచారం కారణంగా థియేటర్ల వద్ద భారీ రద్దీ కనిపించింది. విజయవాడలో అయితే జనాన్ని నియంత్రించడానికి 144 సెక్షన్ కూడా పెట్టాల్సి వచ్చింది. టికెట్ ఉన్నవారినే ఆ ప్రాంతంలోకి అనుమతించే పరిస్థితి వచ్చింది. అప్పట్లో రేడియో లలో పాత పాటలు ఓ అరగంట సేపు ప్రసారమయ్యేవి. ప్రచారంలో భాగముగా విడుదలకు ముందే రేడియోలలో పాటలు ప్రసారమైన చిత్రం కూడా సింహాసనమే.
ఈ సినిమాలో కృష్ణ సైన్యాధిపతి విక్రమసింహ , యువరాజు ఆదిత్య వర్ధన గా రెండు పాత్రల్లో నటించారు. యువరాణి అలకనంద దేవి గా జయప్రద , రాజ నర్తకి గా రాధ , అడవి కన్యగా మందాకిని నటించారు. మహారాణి పాత్రలో కృష్ణ
తల్లిగా వహీదా రెహమాన్ నటించడం సినిమాకు మరింత ప్రత్యేకత తీసుకువచ్చింది.
సినిమాకోసం 𝟑కోట్లకుపైగా ఖర్చు చేశారు. అప్పటి కాలంలో ఇది చాలా పెద్ద బడ్జెట్. విడుదలైన మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించి, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చి , కొన్ని కేంద్రాల్లో 𝟏𝟎𝟎 రోజులకు పైగా ఆడింది.
డిస్కో డాన్సర్ , షరాబీ వంటి పలుచిత్రాలతో బాలివుడ్ ను షేక్ చేసిన సంగీత దర్శకుడు బప్పీ లహరి సంగీతంలో వేటూరి రాసిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి......
కృష్ణ - 𝐒𝐏బాలసుబ్రమణ్యం మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా కొత్త గాయకుడు రాజ్ సీతారాంతో పాటలు పాడించటం , ఆపాటలు సూపర్ హిట్ కావటం ప్రత్యేకత.
🎼ఆకాశంలో ఒక తార ........
🎼అరే వహవా నీ యవ్వనం....🎼 పాటలు ఇప్పటికీ ఏదో ఓమూల వినపడుతూనే ఉంటాయి...
🎼ఇది కలయని... నేననుకోనా....
🎼గుమ్మా.... గుమ్మా... ముద్దు గుమ్మా....
🎼వయ్యారమంతా కోరే... పాటలతో పాటు
🎼స్వాగతం...స్వాగతం అనే గ్రూప్ డాన్స్ బాగున్నాయి.
కథ విషయానికి వస్తే...........దశార్ణరాజ్యంలో విక్రమసింహ అనే సైన్యాధిపతి రాజ్యంలో జరిగే రాజకీయకుటిల,కుట్రల వల్ల రాజ్యంనుండి బయటికి పంపబడతాడు. తర్వాతతిరిగి వచ్చి శత్రువులను ఎదుర్కొనడముతో పాటు..... పక్కనున్న అవంతి రాజ్యంలో నెలకొన్న పరిస్థితులను సరిదిద్ది....రెండు రాజ్యాల్లో శాంతిని ఎలా తీసుకొచ్చాడన్నదే కధాంశం...
మొత్తంగా ‘సింహాసనం’ సినిమా టెక్నాలజీ, కథ, భారీ సెట్స్, యాక్షన్ సన్నివేశాలు అప్పట్లోఓపెద్ద విజువల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించింది. అందుకే భారీ జానపద చిత్రాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈసినిమా గుర్తుకొస్తూ తెలుగు సినిమాల్లో మరువరాని చిత్రముగా నిలిచింది.
పైతారాగణముతో..... ప్రభాకర్ రెడ్డి , సత్యనారాయణ , గిరిబాబు , అంజద్ ఖాన్ , కాంతారావు , 𝐌 బాలయ్య , గుమ్మడి , తదితరులు నటించిన ఈ సినిమా యూట్యూబ్లో ఉంది . దాదాపుగా అందరూ చూసే ఉంటారు . సినిమా కోసం కాకపోయినా భారీ సెట్టింగ్స్ పాటల కోసము మరోసారి చూడదగ్గ సినిమాయే వీలైతే చూడండి....

0
0 views

Comment