logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మంత్రి నిమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన కోటగిరి నారాయణరావు


విజయనగరం జిల్లా.రాజాం:

అమరావతిలో నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఏపీ ఎస్‌ఐడీసీ స్టేట్ బోర్డు డైరెక్టర్ కోటగిరి నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, కోటగిరి నారాయణరావును సత్కరించారు.
ఈ భేటీలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కీలక నీటిపారుదల ప్రాజెక్టుల సమస్యలను కోటగిరి నారాయణరావు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రాజెక్టుల పురోగతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారని తెలిసింది.
ఈ కార్యక్రమంలో ఏపీ ఐడీసీ చైర్మన్, ఎం.డి తదితరులు పాల్గొన్నారు.

11
75 views

Comment