భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమించాలి
వాంకుడోతూ మోతిలాల్
ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్)*తెలంగాణ రాష్ట్రకమిటీ సభ్యుడు
ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం అమర్సింగ్ తండా గ్రామంలో ప్రగతిశీల యువజన సంఘం అమర్సింగ్ తండా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95వ వర్ధంతి వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. పివైయల్ అమర్సింగ్ తండా అధ్యక్షుడు కామ్రేడ్ బాలు అధ్యక్షత వహించగా, పివైయల్ అమర్సింగ్ తండా కార్యదర్శి వీరేష్ జెండా ను కార్యదర్శి ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వాంకుడోతూ మోతిలాల్, గ్రామ నాయకుడు వీరేష్ పాల్గొని మాట్లాడారు. బ్రిటిష్ పరాయి పాలనకు వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ మరణించి 95 సంవత్సరాలు అయినప్పటికీ దేశంలో నిజమైన స్వాతంత్ర్యం లేదన్నారు. భగత్ సింగ్ లాంటి పోరాట చైతన్యం కలిగిన యువతరం ఈ దేశానికి అవసరం అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న మతోన్మాద బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న తప్పుడు చట్టాల మూలంగా దేశ సంపద మొత్తం కార్పోరేట్ శక్తుల చేతిలోకి వెళ్లిందన్నారు. దేశ వనరులను, దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడుదారులకు గంప గుత్తగా అప్పగించే దళారీ ప్రభుత్వాలను యువతరం ప్రశ్నించాలన్నారు. ఒకపక్క సామ్రాజ్యవాదం, మరొక పక్క పెట్టుబడిదారీ విధానం వారి మధ్య జరుగుతున్న ఆధిపత్యం మూలంగా మూడో ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తున్నాయన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఖండించాల్సిన భారత ప్రభుత్వం అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో, దేశంలో చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతూ ప్రజల జీవనం స్తంభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మరో పక్క రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారిన పడుతుందన్నారు. ప్రభుత్వాలు, పాలకులు ఎన్నికల నాడు అనేక ఉచిత వాగ్దానాలను చేసి అమలు జరపడంలో విఫలం అవుతున్నారన్నారు. దేశంలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం మరో స్వాతంత్ర్య ఉద్యమానికి యువత సిద్ధం కావాలన్నారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో పోరాడి దేశ భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘo నాయకులు న్యూడెమోక్రసీ అమర్సింగ్ తండా కార్యదర్శి వాంకుడోతూ రవి , పోచారం మాజీ సర్పంచ్ శ్రీను, మాజీ ఉప సర్పంచ్ జర్పలా లింగ,వార్డ్ సభ్యులు భాస్కర్, పార్వతి,సెల, బాధవత్ వీరేష్, అనిల్, నవీన్, బాను చందర్, రంగన్న,శంకర్, పకీరా,దేస్సు, మోతిలాల్,కాస్నా, అరుణ్, రమేష్, రాంచంద్, చిన్న, చందు, బిచ్చు, సూరా, చిన్న, హచ్చ,తదితరులు పాల్గొన్నారు. విప్లవాభివందనాలతో...
గుగులోత్ వీరేష్
PYL అమర్సింగ్ తండా కార్యదర్శి .
గుగులోత్ బాలు
PYL అమర్సింగ్ తండా అధ్యక్షుడు.