గీసుకొండ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
జర్నలిస్ట్: ఆకుల గణేష్
గొర్రెకుంట గ్రామంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు లాదెళ్ల రాజు అనుమానాస్పద మృతిపై న్యాయం చేయాలని కోరుతూ గీసుగొండ పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు ధర్నా చేశారు. ఆరు నెలలు గడుస్తున్నా పోలీసులు సరైన విచారణ చేయకపోవడం, మృతికి గల కారణాలు చెప్పకపోవడం, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు ఒంటిపై అనుమానాస్పద గాయాలున్నా పోలీసులు హత్యగా పరిగణించడం లేదని కుటుంబీకులు ఆరోపించారు.