భూపాలపల్లి: దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడి
జర్నలిస్ట్: ఆకుల గణేష్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 22న ఈ ఘటన జరిగింది. ఓ మండలానికి చెందిన చిన్నారి ఇంటివద్ద ఆడుకుంటుండగా, బాలికను సమీపంలోని పార్కు దగ్గరకు తీసుకెళ్లి ఇద్దరు బాలురు లైంగిక దాడి చేశారు. అస్వస్థతకు గురైన బాలికను తల్లిదండ్రులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.