కాపు భవన్ అభివృద్ధికి మరో కోటి విరాళం – మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం దాతృత్వానికి ప్రశంసల వెల్లువ
కాపు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న కాపు భవన్ అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి కుటుంబం తరఫున మరో కోటి రూపాయల విరాళం అందించడం విశేషంగా నిలిచింది.
ఇప్పటికే కాపు భవన్ నిర్మాణం కోసం మూడున్నర ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు, గతంలో ఒక కోటి రూపాయల విరాళం అందించిన నారాయణ గారు, తమ సేవా స్పూర్తిని కొనసాగిస్తూ మరోసారి దాతృత్వాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా ఆయన కుమార్తె సింధూరి గారి భర్త పునీత్ గారు ఒక కోటి రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజ సేవ పట్ల తమ కట్టుబాటును మరొకసారి స్పష్టం చేశారు.
“కాపు భవన్ కేవలం ఒక భవనం కాదు… అది కాపు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీక. ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తున్న నారాయణ గారు మరియు వారి కుటుంబానికి మనమంతా రుణపడి ఉంటాం” అని జనసేన నాయకుడు కిషోర్ గునుకుల పేర్కొన్నారు.
సమాజ అభ్యున్నతికి రాజకీయాలకు అతీతంగా సేవ చేయగలిగితేనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలాంటి మహోన్నత దాతృత్వాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పునీత్ గారు, కిషోర్ గునుకుల, పోతురాజు అనిల్, గాదిరాజు అశోక్, భూపతి విజయ్ కుమార్, పులి శ్రీనివాస్, సూరిశెట్టి గాయత్రి, బివి శ్రీనివాసులు, విజేత తదితరులు పాల్గొన్నారు.