logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొడిమ్యాల చిలుకవాగు ప్రక్షాళననిధులకై మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో వినతిపత్రం అందించిన కొడిమ్యాల గ్రామ సర్పంచ్ జీవన్ రెడ్డి.

AIMA పత్రిక ప్రతినిధి. రాజేంద్రప్రసాద్. కొడిమ్యాల.
కొడిమ్యాల పట్టణ కేంద్రంలో ప్రధాన సమస్య అయిన చిలుకవాగు ప్రక్షాళన కోసం అవసరం అయిన 4 కోట్ల నిధులు, మోడల్ బస్ స్టాండ్ నిర్మాణంకోసం 2 కోట్ల నిధుల మంజూరీ నిమిత్తం మంగళవారం అసెంబ్లీలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ(సీతక్క) కు, రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు, చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి కొడిమ్యాల గ్రామ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఇట్టి సందర్బంగా మంత్రులు నిధుల కేటాయింపు పైన స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలిపారు. గ్రామఅభివృద్ధికోసం ఇచ్చిన హామీల అమలుకు నిధుల మంజూరీకోసం కృషిచేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు సర్పంచ్ జీవన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

9
374 views

Comment