ఘనంగా 1983-84 పూర్వ విద్యార్థుల మూడవ ఆత్మీయ సమ్మేళనం.
AIMA పత్రిక ప్రతినిధి. రాజేంద్ర ప్రసాద్.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో 1983- 84 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల 3వ,ఆత్మీయ సమ్మేళనం, అసోసియేషన్ ద్వారా ఘనంగా, కన్నుల విందుగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముందుగా బాల్య మిత్రులు అందరూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం పొందారు. ఇట్టి సందర్భంగా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బాసెట్టి రవి నందన్ రావు మాట్లాడుతూ 2019లో పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకొని అప్పటినుండి అలుపెరుగని కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేదలను ఆదుకోవడంలో ముందున్నామని తెలుపారు. అలాగే ఈ ఏడు సంవత్సరాలు చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమ్మేళన కార్యక్రమంలోని సభ్యుల్లో కొందరు చనిపోయిన మిత్రుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంఘ సభ్యుల్లోని ప్రమోషన్ పొందిన ఉద్యోగస్తులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఇట్టి సంక్షేమ సంఘ సభ్యులు అంకం జనార్ధన్- పద్మల కూతురు అఖిల సాహితీ కోల్ ఇండియాలో చేరి మొదటి మహిళ మైనింగ్ ఇంజనీర్ గా గుర్తింపు పొంది, ప్రస్తుతం ఓపెన్ కాస్ట్ మైండ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న సందర్భంగా అంకం అఖిల సాహితీని సంక్షేమ సంఘం ఘనంగా సన్మానించింది. అనంతరం సంక్షేమ సంఘం పదవి కాలం ముగిసిన సందర్భంగా కొద్ది మార్పుతో పాత కమిటీ నే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులందరూ వారిని సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు గుర్రం భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి బాసెట్టి రఘునందన్ రావు, ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకటలక్ష్మి, కార్యదర్శి శైలజ, సాగి సతీష్ రావు, కార్యవర్గ సభ్యులు ప్రస్తుత కొడిమ్యాల ఉపసర్పంచి గుర్రం నర్సయ్య, అంకం జనార్ధన్, కంచర్ల గంగా చారి, చిన్నమనేని మహేందర్ రావు, సభ్యులు ముమ్మాడి లక్ష్మణాచారి, కోల గంగరాజం, మోటూరి శ్రీనివాస్ ఊటుకూరి రవీందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎల్లం శ్రీనివాస్ లక్ష్మీరాజం చిన్న దేవయ్య, గాలిపెళ్లి ఆనంద్, విజయేందర్ రావు సుజాత వాణి తదితర సభ్యులు 150 మందికి పైగా పాల్గొన్నారు.