మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం భీంపూర్ మండలం
పత్రిక ప్రకటన
మార్చి 24, 2026_ఆదిలాబాదు:
అందర్ బంద్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు
ఈ సందర్భంగా పాఠశాలలోని వంట గది, సరుకు నిల్వల గది, భోజన శాల, వసతి గృహాలను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఎప్పటికపుడు రిజిస్టర్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ నీటి నాణ్యతను క్వాలిటీ మీటర్ తో కొలిచి చూశారు. స్టోర్ రూమ్ లో బియ్యం,గుడ్ల నాణ్యతను పరిశీలించి నాణ్యత లేని వాటిని తిరిగి పంపించాలని అందేశించారు.
అనంతరం RBSK వైద్య బృందం అధికారులను విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్ రమేష్, హెచ్ డబ్ల్యు ఓ జ్ఞానేశ్వర్, RBSK వైద్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.