ఇల్లందు పట్టణంలో ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారుతున్న రోడ్లపై కూరగాయల విక్రయాలు – వెంటనే చర్యలు తీసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని జగదాంబ సెంటర్ నుండి ఆంధ్ర బ్యాంకు వరకు రహదారి ఇరువైపులా ప్రతిరోజు సాయంత్రం సమయంలో, ఇతర ప్రాంతాల నుండి వచ్చి కొందరు కూరగాయల వ్యాపారులు రోడ్లపై కూరగాయలు పోసి విక్రయాలు నిర్వహిస్తున్నారు.
దీంతో:
రహదారి సగం వరకు ఆక్రమణ జరుగుతోంది
ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం కలుగుతోంది
అత్యవసర వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి
ప్రశ్నించిన స్థానిక ప్రజలు, వ్యాపారులపై అశ్రద్ధగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా, దాడులకు కూడా ప్రయత్నిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి
ఈ పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతూ, పట్టణ శాంతి భద్రతలకు కూడా భంగం కలిగించే పరిస్థితి ఏర్పడుతోంది.
అందువల్ల:ఇల్లందు ఎమ్మెల్యే గౌ. శ్రీ కోరం కనకయ్య గారు,
జిల్లా కలెక్టర్ గారు,మున్సిపల్ చైర్ పర్సన్ గౌ. శ్రీమతి దొడ్డ కిరణ్ మిత్ర గారు, మున్సిపల్ కమిషనర్ గారు,
ఇల్లందు పోలీస్ స్టేషన్ SHO గారు,సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి:
రోడ్ల ఆక్రమణలను తొలగించాలి
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రజల భద్రతను నిర్ధారించాలి
అని ఇల్లందు పట్టణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.