logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆళ్లగడ్డలో ఇళ్ల స్థలాల కోసం ధర్నా - ఎర్రజెండా ఆధ్వర్యంలో నిరసన జ్వాల.

AIMA న్యూస్‌ నంద్యాల జిల్లా.ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ (MRO) కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం రోజున పేదలకు గూడు.అనే నినాదంతో భారీ ధర్నా నిర్వహించారు. నివాస స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఐ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా, పేదలకు స్థలాలు కేటాయించడంలో ఎమ్మెల్యే మరియు ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. హామీలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, క్షేత్రస్థాయిలో పని చేయాలని వారు డిమాండ్ చేశారు.
నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నివేశన స్థలం కేటాయించాలి. ఇళ్ల పట్టాల పంపిణీలో రాజకీయ జోక్యం లేకుండా, నిజమైన పేదలను గుర్తించి న్యాయం చేయాలి.ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు నిర్దేశిత సమయంలోగా పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలి.
నిరుపేదల గోడు వినకపోతే, రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ పట్టణ వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, తెలిపారు. ఎమ్మార్వో జ్యోతి రత్నకుమారి అందుబాటులో లేకపోవడంతో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎలక్షన్ డిటి విజయలక్ష్మికి అందజేశారు.

49
2099 views

Comment