110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న సైనిక విమానం కుప్పకూలింది – కొలంబియాలో భారీ విషాదం
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**మార్చి 24 **(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
*110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న సైనిక విమానం కుప్పకూలింది – కొలంబియాలో భారీ విషాదం*
కొలంబియా దక్షిణ ప్రాంతంలో 110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న ఒక సైనిక విమానం కుప్పకూలింది. ఈ విషయాన్ని కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది. పెరూ సరిహద్దు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
కొలంబియా దక్షిణ అమెజాన్ లోతట్టు ప్రాంతంలోని ప్యూర్టో లెగీజామో ప్రాంతం నుండి లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన హెర్క్యులస్ సి-130 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలతో కుప్పకూలినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఈ ప్రమాదంలో సైనికుల ప్రాణనష్టం ఎంత మేరకు జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఘటనపై అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.