అరకు: బోర్ రీప్లేస్ చేయాలంటూ ఖాళీ బిందెలతో నిరసన
పాడైన సోలార్ బోర్ రీప్లేస్ చేయకపోవడంతో బురద నీరు వాడుతున్నామని అరకులోయ(M) బస్కి పంచాయితీ కంజరితోట గ్రామస్తులు తెలుపుతూ వాపోయారు. మంగళవారం పాడైన బోరు వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సోలార్ బోర్ రీప్లేస్ కు పంచాయితీ నుండి జిల్లా స్థాయి వరకు వినతులు ఇచ్చినా చర్యలు లేవన్నారు. వెంటనే రీప్లేస్ చేయకపోతే ఎంపీడీఓ ఆఫీస్ వద్ద బిందెలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు.