logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కాకతీయ యూనివర్సిటీలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా 2K వాక్ – ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా SFI పిలుపు

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ (SFI) ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు 2K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ర్యాగింగ్ అనే సామాజిక భూతాన్ని తరిమికొట్టాలని, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం, ఫార్మసీ డీన్ గాదే సమ్మయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గాదె ప్రభాకర్ రెడ్డి, సీఐ రవి కుమార్, ఎస్ఐ కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు.
అలాగే ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా నాయకులు స్టాలిన్, శ్రీకాంత్, బొచ్చు కళ్యాణ్ మరియు యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు చెన్నూరి సాయి కుమార్, బిరెడ్డి జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ర్యాగింగ్ వ్యతిరేక నినాదాలు చేశారు.

10
851 views

Comment