logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం విజయవంతం.

పాణ్యం (AIMA MEDIA): శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో (SREC) మేధో సంపత్తి హక్కులు పై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని RTIH మరియు వారి బృందం సహకారంతో నిర్వహించారు. రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్న శ్రీనివాస్ మద్దిపాటి మాట్లాడుతూ, ఆధునిక యుగంలో ఆవిష్కరణలు, పేటెంట్లు, కాపీరైట్స్ వంటి మేధో సంపత్తి హక్కుల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు తమ ఆలోచనలను సురక్షితంగా ఉంచుకోవడానికి IPR నమోదు ఎంతో అవసరమని ఆయన తెలిపారు.ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ హఫీజ్ బాషా మరియు వారి బృందం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పరిశోధన మరియు ఆవిష్కరణలపై దృష్టి సారించి, తమ ఆలోచనలను సమాజానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి. సుబ్రహ్మణ్యం గారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, విద్యార్థులు కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని చట్టపరంగా రక్షించుకోవడం కూడా నేర్చుకోవాలని పేర్కొన్నారు.డేటా సైన్స్ విభాగాధిపతి రమాదేవి మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో ఉన్న విద్యార్థులకు IPR పై అవగాహన అత్యంత ముఖ్యమని, ఇది వారి భవిష్యత్తు పరిశోధనలకు మరియు స్టార్టప్‌లకు దోహదపడుతుందని తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమం SREC IEEE స్టూడెంట్ బ్రాంచ్ మరియు IEEE కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

0
496 views

Comment