కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మౌలాభి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆర్థిక సాయం
గిద్దలూరు టౌన్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పోతుగంటి మౌలాబి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వెంటనే స్పందించారు. బాధితురాలి కుమారుడు, వికలాంగుడైన పోతుగంటి దస్తగిరిని పిలిపించి పరామర్శించారు.
తక్షణ సహాయంగా ₹10,000 ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా ఒంగోలులోని సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, మౌలాబికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితురాలి కుమారుడు వికలాంగుడైన దస్తగిరి తో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము అందించిన 10000 రూపాయలను ఆసుపత్రి ఖర్చులకు వినియోగించుకోవాలని సూచించారు అంతేకాకుండా ఏ అవసరం ఉన్నా తనను వచ్చి కలవాలని దస్తగిరికి ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా మౌలాబి కుమారుడు దస్తగిరి ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామ్ నగర్ కాలనీ నివాసులు పాల్గొన్నారు.