logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అక్రమ 590/2023 రిజిస్టర్ పై చర్యలు తీసుకోవాలి, వెంటనే రద్దు చేయాలి.


నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రానికి చెందిన కమతం తాటిరెడ్డి కి తన తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన రుద్రవరం మండలం ఆర్. నాగులవరం గ్రామ పొలిమేరలోని సర్వే నెంబర్ 320,321,322,323,324 లోని 5ఎకరముల పొలం అదే గ్రామానికి చెందిన ఒక పొలిటికల్ లీడర్ కన్ను పడింది.తన అనుచరుడైన జమ్మలమడుగు మండలం బెచ్చమల గ్రామానికి చెందిన పరదేశి వెంకటేశ్వర్లు పేరు మీద తన పలుకుబడితో 402 ఖాతా కలిగిన పాసు పుస్తకం చట్టవిరుద్ధంగా పొందటం జరిగింది. అది తెలుసుకున్న తాటిరెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి RTI ఆక్ట్ ద్వారా 402 ఖాతా పై జిల్లా కలెక్టర్ కి అర్జీ ద్వారా వివరణ కోరగా 402 పరదేశి వెంకటేశ్వర్లు ఖాతా పాసు పుస్తకం గతంలోనే రద్దు అని రాసి, ఆ ఖాతా ను కొట్టివేసి ఉన్నారని సమాచారం ఇవ్వటం జరిగింది.తరువాత మళ్ళీ కుట్ర చేసి కమతం తాటిరెడ్డి పేరు మీద ఉన్న 415 ఖాతా పసుపుస్తకం తొలగించి ఎలాంటి నోటీస్,సమాచారం లేకుండా పలుకుబడితో ఎమ్మార్వో వేంకట శివ ద్వారా మరోసారి పరదేశి వెంకటేశ్వర్లు భార్య గుర్రమ్మ పేరు మీద ఖాతా నంబర్ 1210 గా 5 ఎకరాలు ఒకే రోజు మార్చటం జరిగింది.ఆది గుర్తించిన రామచంద్రారెడ్డి వెంటనే తన తండ్రి పేరు న ఉన్న పాస్ బుక్ తొలిగించి ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా మార్చారని,వాటి నకలు ఇవ్వాలని RTI ఆక్ట్ ద్వారా కోరగా రుద్రవరం తాసిల్దార్ సమాధానంగా ఎలాంటి డాక్యుమెంట్లు,ఎలాంటి ఆధారాలు మరియు జడ్జిమెంట్ పత్రాలు సమర్పించలేదని ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. పలుకుబడితో అక్రమంగా ఆన్లైన్లోకి ప్రవేశించిన గుర్రమ్మ తెలివిగా కోవెలకుంట్ల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి 2023 లో తన భర్త పేరున సర్వే నెంబర్ 320 లోనీ 1.05 ఎకరా పొలం రిజిస్టర్ చేపించడం జరిగింది. జరిగిన విషయాలన్నింటినీ ఆళ్లగడ్డ కోర్టులో తెలియపరచి తాటిరెడ్డి OS 377/2021లో ఇంజక్షన్ ఆర్డర్ ఆపై టిల్ ఫర్ ఆర్డర్ పొందడం జరిగింది. కోర్ట్ ఆర్డర్లను ధిక్కరించి ఆర్డర్ ఉన్న కూడా లెక్కచేయకుండా డాక్యుమెంట్ 590/2023లో కోవెలకుంట్ల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి రిజిస్టర్ చేసిన వీరిపై కఠిన చర్యలు తీసుకుని వారు చేసిన రిజిస్టర్ ని రద్దు పరచాలని బాధితులు కోరుతున్నారు. అక్రమ ఆన్లైన్ చేసిన తహసిల్దార్,vro పై, అక్రమ ఆన్లైన్ అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు దాడులకు కాలు దువ్వుతున్న అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తమ పొలాన్ని తిరిగి ఆన్లైన్ చేయాలని లేని పక్షంలో తనకు చావే గతి అవుతుందని వాపోయారు.

0
0 views

Comment