logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

కామారెడ్డి ప్రతినిది తేది:23.03.2026.

కామారెడ్డి జిల్లా సోమవారం. .. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ ..
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, “నీటి ప్రతిజ్ఞ” చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిజ్ఞ తీసుకున్న ప్రతి వ్యక్తి:
నేడు నీటిని సంరక్షించేందుకు, పొదుపుగా వినియోగించేందుకు తాము అంకితం చేస్తారని
నీటిని వృథా చేయకుండా ఒక్క బొట్టు కూడా వృథా చేయకుండా చూసేందుకు
తన కుటుంబ సభ్యులు కూడా నీటిని వృథా చేయకుండా చూసేలా చేస్తారని
నీటిని అత్యంత విలువైన వనరుగా భావిస్తూ, తెలివిగా వినియోగిస్తారని
ప్రాంతీయ ,జాతీయ స్థాయిలో ప్రపంచ నీటి దినోత్సవం ను పురస్కరించుకొని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నీటిని పరిరక్షించడం ఎంత ముఖ్యమో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరిని నీటి వినియోగంలో జాగ్రత్త పాటించాలని, భూమి , భవిష్యత్తు తరాల కోసం నీటిని రక్షించుకోవడం అవసరం అని సూచించారు. ఈ కార్యక్రమం లో ACLB మధుమోహన్, సీఈఓ చందర్, RDO వీణ, భూగర్భ జల శాఖ అధికారి సతీష్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.

14
542 views

Comment