బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ.
పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం.
జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు.
పత్రిక ప్రకటన
అదిలాబాద్ జిల్లా,
మార్చి 23 :-
బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ.
పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం.
జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు.
28 ఫిర్యాదులను స్వీకరణ.
వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు.
సమస్యలపై, అసాంఘిక కార్యకలాపాలపై 8712659973 నెంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని పిలుపు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన 28 ఫిర్యాదుదారులు స్వయంగా జిల్లా ఎస్పీకి నేరుగా తమ సమస్యలను విన్నవించుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను విన్న జిల్లా ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు సమస్యలపై లేదా అసాంఘిక కార్యకలాపాల సమాచారాలపై జిల్లా ఎస్పీ గారిచే నేరుగా నిర్వహించబడుతున్న 8712659973 నెంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. సమస్యలలో ఎక్కువ శాతం కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు భూ పరిష్కారాలు మోసాలు, కేసుల పురోహితులు ప్రస్తుత స్థితిగతులపై ఫిర్యాదులు అందడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.