logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మొక్కజొన్న రైతుల పట్ల కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి..సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ .

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మొక్కజొన్న రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ విమర్శించారు. ఆళ్లగడ్డ పట్టణంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి .రమేష్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారని, ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు అమలు జరగక, తక్కువ ధరకు అమ్ముకొని మధ్య దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రుద్రవరం, ఆళ్లగడ్డ మండలంలోని కొన్ని గ్రామాల్లో రైతులతో కలిసి మాట్లాడినామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాలకు 2400 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం తప్ప, ఆచరణలో మన రాష్ట్రంలో మద్దతు ధర చట్టాన్ని అమలు చేయడంలో రెండు ప్రభుత్వాలు కూడా విఫలం అయ్యాయన్నారు. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే జోక్యం చేసుకొని రైతుల వద్ద మొత్తం మొక్కజొన్నలను కొనుగోలు చేసిందన్నారు. మన రాష్ట్రంలో కేవలం 1600 రూపాయలకు మాత్రమే మధ్య దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్ నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రచార ఆర్భాటాలు చేయడం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క చోట కొనుగోలు కేంద్రం పెట్టలేదన్నారు. ఓట్ల అవసరాల కోసం రైతుల గురించి గొప్పగా చెప్పుకోవడం తప్ప ఆచరణలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా, మధ్య దళారులు ఇష్టం వచ్చినట్టు రైతులను దోచుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం కలిపిస్తున్నాయన్నారు. ఒక ఎకరాకు 40వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఖరీఫ్ సీజన్లో ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్ల మాత్రమే దిగుబడి వచ్చి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతే, ప్రస్తుతం రబీలో దిగుబడిలో ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు పెరిగిన కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మూలంగా కేవలం 1600 కు మాత్రమే అమ్ముకొని నష్టపోతున్నారు. ఇష్టానుసారం విత్తనాలు, ఎరువులు పురుగు మందుల ధరలు పెంచే ప్రభుత్వాలు, సకాలంలో కొనుగోలు ఎందుకు పెట్టడం లేదో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వాలే మధ్య దళారులతో కుమ్మక్కయి రైతుని దోచుకునుటకు అవకాశం కల్పిస్తుందని అనుమానాలు కలుగుచున్నాయి అని అన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధు లు ముఖ్య మంత్రి తో మాట్లాడి ఎందుకు కొనుగోలు కేంద్రాలు పెట్టించడం లేదో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి వెంటనే జిల్లాలో అన్ని మండలాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలు అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. మన దేశంలోనే మద్దతు ధరలు లేక నష్టపోతుంటే గోరుచుట్టుపై రోకలి పోటు అన్న చందంగా మోడీ అమెరికాతో ఒప్పందాలు చేసుకుని మొక్కజొన్నలు, పత్తి, సోయాబీన్, పండ్లు, పాలు మొదలగు ఉత్పత్తులు దిగుమతి చేసుకొని దేశ రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారన్నారు. కావున రైతులందరూ మన దేశానికి నష్టం కలిగించే ఒప్పందాలను రద్దు చేయాలని ,అందుకు రైతులందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి.రామచంద్రుడు, రైతు సంఘం నాయకులు జి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

21
433 views

Comment