ఓటమికి కుంగి పోవద్దు- కంది శ్రీనివాస రెడ్డి
ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్ధులతో సమావేశం
ఆదిలాబాద్ : ఓటమి రేపటి గెలుపుకు పునాది అని ఓడిపోయిన వారు కుంగిపోవద్దని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.సోమవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవాభవన్ లో ఇటీవలి గ్రామ పంచాయితీల ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్ధులతో ఆయన సమావేశమయ్యారు. చాలా భవిష్యత్తు మున్ముందు ఉందని వారిలో ఉత్తేజాన్ని నింపారు.ఓటమి చెందినప్పటికీ నిరాశ చెందకుండా రేపటి భవిష్యత్తు కోసం నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు.