కాంగ్రెస్ లో సర్పంచుల చేరిక
కండువాలు కప్పి స్వాగతించిన కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ : గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి సూచించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముగ్గురు సర్పంచులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.బూర్నూర్,లోహార,లింగుగూడ గ్రామ పంచాయితీల సర్పంచులు ఆత్రం గంగారాం, వసంత్ రావు , మానిక్ రావులకు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. గ్రామ పంచాయితీల ప్రగతి కోసం సర్పంచులు అధికార కాంగ్రెస్ లో చేరడం చాలా సంతోషకరమన్నారు.అంతా కలిసి పల్లెల ను అభివృద్ధి చేసుకుందామని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు.