logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 1 కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అంద

విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 1 కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రుల సమక్షంలో బాధితులకు చెక్కులు అందించారు.

✅ మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు. విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు.

✅ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచాం. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకూడదని కుటుంబ బీమా తీసుకొచ్చాం.

✅ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.

✅ అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, మహమ్మద్ అజహరుద్దీన్ గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

0
0 views

Comment