logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ రాష్ట్ర స్థాయి రెండో ఎడిషన్ సీఎం కప్‌లో ఆదిలాబాద్ జిల్లా ఘనత



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెండో ఎడిషన్ సీఎం కప్‌ క్రీడా పోటీలలో ఆదిలాబాద్ జిల్లా అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన సందర్బంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రీడాకారులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా అభినందించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పారామీటర్ల ఆధారంగా నిర్వహించిన ఈ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా అత్యధికంగా 82 పాయింట్లు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 50 మంది క్రీడాకారులు రేపు హైదరాబాద్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారని, జిల్లా సాధించిన ఈ ఘనతపై జిల్లా ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డివైఎస్ఓ శ్రీనివాస్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

3
167 views

Comment