logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పోలీసు విధులను ఆటంకపరిచిన వారిపై కఠిన చర్యలు తప్పవు. 24 గంటలు ప్రజారక్షణలో పోలీసు వ్యవస్థ విధుల నిర్వహణ జిల్లాలో ఇప్పటివరకు మూడు కేసుల నమోదు.

పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 23 :-

కటకటాల్లోకి ముగ్గురు నేరస్తులు.

నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడలలో జరిగిన మూడు ఘటనలు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో భాగంగా 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై కఠిన మైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉంటూ, విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడడం, విధులను అడ్డుకోవడం వంటి చర్యలు అసలు సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధుల్లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు ఘటనల్లో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, పోలీసు సిబ్బందికి సహకరించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తినప్పుడు చట్టబద్ధ మార్గాలను ఆశ్రయించాలని సూచించారు. పోలీసులపై దాడులు, విధులకు అడ్డంకులు కలిగించడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటానికి, నేరాలను అరికట్టడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల సహకారం పోలీసులకు అత్యంత అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

0
0 views

Comment