అబ్దుల్ అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మాతృమూర్తి శ్రీమతి అన్వర్ జాన్ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, మాజీ మంత్రి మరియు వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నేడు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ గారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు గారు, వైసీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మవులూరు శ్రీనివాసులురెడ్డి గారు, బుచ్చిరెడ్డిపాలెం మునిసిపాలిటీ వైసీపీ అధ్యక్షులు షేక్ షాహుల్ గారు, విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు కలువ బాల శంకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.