సీలేరు: జాతీయ పోటీలలో సత్తా చాటిన జడ్పీ హైస్కూల్ పీడీ చిన్ని
మహారాష్ట్ర పూణే లో ఈ నెల 19 నుండి 22 వరకు జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో ఆంధ్రా జట్టు మూడవ స్థానం సాధించి, కాంస్య పతకం పొందింది. ఈ జట్టు లో అల్లూరి జిల్లా సీలేరు ZPH పాఠశాల పీడీ జీ చిన్ని ఉన్నారు. కాగా జట్టు గెలవడంలో ఆల్ రౌండర్ గా ప్రతిభ చూపిన పీడీ చిన్ని ని సీలేరు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం నాగభూషణం, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.