మోహన్ బాబు తన నట జీవితం
మోహన్ బాబు తన నట జీవితంలో విలన్ , హీరోగా చాలా సినిమాలు చేసినప్పటికీ హీరోగా" అల్లుడు గారు"తోమొదటి హిట్ అందుకున్న తర్వాతి బ్లాక్ బస్టర్ మూవీ " అసెంబ్లీ రౌడీ ". సత్యరాజ్ హీరోగా చేసిన"వేళయ్ కిలయ్ చుడుచు" తమిళచిత్ర రీమేక్ ఇది. కన్నడలో " రౌడీ &𝐌𝐋𝐀",హిందీలో
" లోఫర్ " గా రీమేక్ అయింది.....
సత్యరాజ్ (కట్టప్ప ) తమిళ హీరో గా నిలదొక్కుకునేందుకు , తమిళ నట దర్శక రచయిత 𝐏 వాసు చేసిన సినిమాలే ప్రధానం. సత్యరాజ్ చేసిన సినిమాలతోపాటు ఇతరతమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి మోహన్ బాబు హిట్స్ అందుకున్నారు.
𝐏వాసు కధకు ఎటువంటి మార్పు లేకుండా క్లైమాక్స్ మార్చి సరైన స్క్రీన్ ప్లే తో మాటలు వ్రాసారు. తమిళంలో బాషాను చంపి , సత్యరాజ్ చనిపోతే, తెలుగులో గాయపడి 𝐌𝐋𝐀గా ప్రజాసేవ చేస్తానని జనాలకు మాట ఇవ్వడంతో సినిమా ముగుస్తుంది. తమిళ బాషాపాత్రధారి ఆనంద్ రాజ్ ముఖ్య అనుచరుడిగ తమిళ్లో నటించిన రాకీ(తెలుగుబాషా) ఇక్కడ బాషా గా నటించాడు.
సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ 𝐁గోపాల్, బొబ్బిలి రాజా ఫేమస్ దివ్యభారతి అందచందాలతోపాటు నాటిఅసెంబ్లీలో జరిగిన సినిమాపేరుపై జరిగిన రగడ కూడా సినిమా విజయానికి దోహదపడ్డాయి . ఈ సినిమా టైటిల్ అప్పట్లో సంచలనంగా మారింది. 𝐀𝐏 అసెంబ్లీని మూడు రోజుల పాటు కుదిపేసింది. అసెంబ్లీలో ఉన్న ప్రజాప్రతినిధులను రౌడీలని చెబుతారా.. ఈ టైటిల్ ఎలా పెడతారు...సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు.ఆనాడు అసెంబ్లీ స్పీకర్ గ ఉన్న ఆలపాటి ధర్మారావు ఈ సినిమా చూశారు. కేవలం టైటిల్ మాత్రమే అసెంబ్లీ రౌడీ గా ఉందని. ఈ సినిమాలో ప్రజా ప్రతినిధులను కించపరిచే ఎలాంటి సన్నివేశాలులేవని చెప్పారని, 𝐌𝐋𝐀లు సైలెంట్ అయ్యారని , సినిమా విజయానికి అప్పటి అసెంబ్లీ గొడవ ద్వారా వచ్చిన పబ్లిసిటీ కూడా ఉపయోగపడిందని ఈమధ్య బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కామెడీ ట్రాక్ కూడా బాగా పండింది.. మామమేనల్లుడుగా మోహన్ బాబు , బ్రహ్మానందం-----స్కూల్లో శుభ్రత పరిశుభ్రత టీచర్ అనుకుని దొడ్లుకడిగే పాకీజా & బ్రహ్మీ సీన్స్ బాగుంటాయి.
అరిస్తే కరుస్తా.....కరిస్తే చరుస్తా లాంటి మోహన్ బాబు కు మాత్రమే సూటయ్యే చమత్కార డైలాగులు , రాజకీయాలపై పరుచూరి బ్రదర్స్ రాసిన వ్యంగ్యపుమాటలు థియేటర్లలో ప్రేక్షకులచే చప్పట్లు,ఈలలు కొట్టించాయి.రౌడీలకు రాజకీయ నాయకుల అండదండలు , ఏది జరిగినా చూసి చూడనట్టు ఉండే పోలీసు అధికారి , ఇండిపెండెంట్ 𝐌𝐋𝐀లకు డబ్బు ఎర చూపి మంత్రులుగా ఉన్నోళ్లు ఆపైపదవికై ప్రయత్నాలు,
ఆక్రమ పోరంబోకు భూముల సర్వే కై వచ్చిన అధికారులు ఎదురు తిరిగితే లేపేయడము లాంటి సన్నివేశాలు ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి .అప్పటికి ఇప్పటికి పెద్దమార్పు లేదనుకోండి , అది వేరే విషయం మనకెందుకు.
𝐌𝐋𝐀...𝐌అంటే మంచిని....𝐋అంటే లాభం చూసుకోకుండా 𝐀అందరికీ పంచేవాడు అనే మంచి అర్ధంతో పాటు.........
𝐌అంటే మర్దర్స్... 𝐋అంటే లూటీస్.. 𝐀 అర్హత ఉన్న వాడే అని రెండవ అర్ధం కూడా పరుచూరి సోదరులు చెప్పారు...
ఇకకథలోకి వస్తే......ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న జగ్గయ్య , అన్నపూర్ణల కొడుకు మోహన్ బాబు డిగ్రీపూర్తిచేసి ఉద్యోగం లేక మేనమామ బ్రహ్మానందంతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్లిన జగ్గయ్య అదేఊర్లో ఉన్న మరో ఉపాధ్యాయుడు గొల్లపూడి కూతురు దివ్యభారతితో ప్రేమలో పడతాడు..
ఆఊరిలో దాదాగిరి చేస్తున్న భాష అనే రౌడీ ఓవ్యక్తి హత్య చేస్తుండగ మోహన్ బాబు చూస్తాడు.అతన్ని ఎదిరించబోగ తల్లి అన్నపూర్ణ అడ్డుపడుతుంది. మరోరోజు తన తల్లిని గాయ పరచడముతో పాటు , సర్వే ఆఫీసర్ ను హత్య చేసి ఆ నేరము మోహన్ బాబు పై వేసి జైలుకు పంపిస్తారు. తన కొడుకు నిర్దోషిగా సాక్ష్యము చెప్పేందుకు బాషాకు భయపడి ఎవరు ముందుకు రాకపోగా ,అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఓ లాయర్ సలహాతో జైలులోఉన్న మోహన్ బాబు చే పోటీ చేయించి , బ్యాలెట్ పేపర్ కు మరో చీటితో అతను నిర్దోషి అని తెలిపి 𝐌𝐥𝐚 గా గెలిపించడంతోపాటు నిర్దోషిగా జనాలు విడుదల చేయిస్తారు.భరించలేని బాషాmlaతల్లిదండ్రులను చంపేస్తాడు.ఆరౌడీలను మట్టుబెట్టి కత్తిపోట్లుతీవ్రగాయలకు గురై మోహన్ బాబు ఆసుపత్రిలో చేరతాడు. చివర్లో అతను కోలుకుని ప్రజలందరికీ అండగాఉంటానని హామీ ఇవ్వడంతో కథ ముగుస్తుంది......
స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్ సంగీతములో రసరాజు,జాలాది గురుచరణ్ , సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన పాటలు
సూపర్ హిట్ గా నిలిచాయి.పై తారాగణముతో పాటు.... పోలీస్ ఆఫీసర్ గా ఆహుతి ప్రసాద్ , ఆర్థిక శాఖ మంత్రిగా సత్యనారాయణ , మాజీmlaగా మోహన్ రాజ్ , భాషాగా రాకీ , 𝐃𝐄𝐎గా మాడా, పాకీజా గా తమిళ నటి వాసుగి , నర్రా వెంకటేశ్వరరావు , చిట్టిబాబు , కాకరాల , కె. కె. శర్మ , తదితరులు నటించిన ఈ సినిమా యూట్యూబ్లో ఉంది. దాదాపు అందరూ చూసే ఉంటారు. ఒకరిద్దరూ ఎవరైనా చూడకుంటే చూసేయండి. సినిమా బాగుంది...