logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొత్తూరు సుబ్బారాయుని సన్నిధిలో ఉమ్మడి జిల్లా విజిలెన్స్ ఎస్పీ పూజలు.

పాణ్యం (AIMA MEDIA): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎ‌స్.కొత్తూరు గ్రామంలో వెలిసి యున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో కర్నూలు ఉమ్మడి జిల్లా విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి ఐపీఎస్ అధికారి ఆదివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ స్వామివారికి అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపము నందు ఆమెను పూలమాలలు, శేష వస్త్రములతో ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్ర పటము, ప్రసాదము అందజేశారు ఈ కార్యక్రమంలో కుమారుడు, బంధువులు, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

0
426 views

Comment