logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇరిగెల సోదరుల చొరవ. ఎంపీ శబరి సహకారం. యువకుడికి కూటమి ప్రభుత్వ అండ.

AIMA న్యూస్‌. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం, ఎస్. లింగందిన్నె గ్రామానికి చెందిన ఇరిగెల కుటుంబ వీరాభిమాని దూదేకుల దస్తగిరి భాష కుమారుడు దూదేకుల సుభాన్ గత కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురయ్యారు. ఆపరేషన్ నిమిత్తం భారీగా ఖర్చవుతుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్న తరుణంలో, ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు, ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఇరిగెల సోదరులు, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి శబరి (టిడిపి) సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కోసం దరఖాస్తు చేయించారు.
ఎంపీ శబరి ప్రత్యేక చొరవ తీసుకుని, బాధితుడి ఆర్థిక పరిస్థితిని వివరించడంతో ప్రభుత్వం నుండి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. తద్వారా సుభాన్ ఆపరేషన్‌కు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కలిగింది. తమ కష్టకాలంలో అండగా నిలిచి, వైద్య ఖర్చుల నిమిత్తం సాయం అందించిన ఎంపీ శబరి కి మరియు ఇరిగెల సోదరులకు దూదేకుల దస్తగిరి భాష కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

85
2108 views

Comment