సమయానికి రాని బస్సులతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు!
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో భూపాలపల్లి నుండి గోదావరిఖని వెళ్లే బస్సులు సమయానికి రావడం లేదని, వస్తే ఒకేసారి రెండు మూడు బస్సులు వస్తున్నాయని, రాకపోతే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోయారు. సంబంధిత ఆర్టీసీ డిపో అధికారులు సమయపాలన పాటించడంలో విఫలమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.