పస్రా: ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేయాలి: సీతక్క
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జల మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామ వీధుల గుండా ర్యాలీ కొనసాగి ప్రజల్లో చైతన్యం పెంపొందించారు