logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు

జర్నలిస్ట్: ఆకుల గణేష్

వన దేవతలు మేడారం సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చి సమ్మక్క - సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని గిరిజన సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుంటున్నారు.

0
0 views

Comment