మరణ వాంగ్మూలం ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు
కేంద్ర ప్రభుత్వాలకు రైతులపై ఎందుకు ఇంత చిన్నచూపు
మరణ వాంగ్మూలంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతు తుడం గణపతి హెచ్చరించిన,రైతులను పట్టించుకోలేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.. ఉగాది పండగ రోజే తుడం గణపతి అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం యావత్ రైతాంగాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసిందని .. ఆదివారం మాజీ మంత్రి జోగు రామన్న రూరల్ మండలంలోని అర్లీ బి గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఆయన మృతి పట్ల తీవ్ర ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఎల్లవేళలా బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని ధైర్యాన్ని కల్పించారు. గణపతి మరణం రైతన్న తీవ్రంగా కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. అనంతరం జోగు రామన్న గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ తుడం గణపతి తన మరణ వాంగ్మూల వీడియోతో హెచ్చరించినప్పటికీని ఎంపీ ఎమ్మెల్యే పట్టించుకోకుండా రైతాంగని విస్మరించడం తగదన్నారు.. రైతులకు పదేళ్లలో రైతులకు రాని కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం లో రెండేళ్లకే ఇబ్బందులు రైతులకు అదురైతున్నాయాని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.. అలాగే జైనథ్ లో కొనుగోలు చేసిన వెయ్యి బస్తాలు వాపస్ రావడం రైతులను మరింత కుంగాదిస్తుందని రైతులు ఆవేదన ను వెళ్లగడుతున్నారన్నారు. పత్తిలో కందులలో మైచర్ నిబంధన తొలగించాల బి ఆర్ ఎస్ పపార్టీ పలు సార్లు డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన నిరసన ధర్నా కారేక్రమాలను చేస్తూ వచ్చిన ప్రభుత్వం దున్నపోతు పై వర్షం పడ్డట్టు వ్యవహరిస్తుందన్నారు..రైతులకు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలా ప్రొచ్చాహం లేక రైతులకు ఏ పంట వేయాలో తెలియలేని గందరగోళ పరిస్థితి రైతులకు నేకొందన్నారు.. రైతులు పండించిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షరతులు విధించి రైతులను తీవ్రంగా నష్టపోయేలాచేస్తుందన్నారు, గత ప్రభుత్వంలో కేసీఆర్ 18 కిస్తీల రైతు బందు భరోసా అందిస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం రెండుసార్లు మాత్రమే ఇచ్చి ఎగగొట్టిందన్నారు, అంతేకాకుండా రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, పండించిన పంటలను కొనే పరిస్థితి లేదు, విత్తనాలు, యూరియా కొరత, ఎరువులు రైతుకు అందని ద్రాక్షలా మారాయి అన్నారు, తుడం గణపతి ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య నేనని జోగు రామన్న హెచ్చరించారు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీ తో పాటు ప్రభుత్వానికి మరల వాంగ్మూల వీడియోను పై పట్టింపు లేకుండా పూర్తి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.. తుడం గణపతి కుటుంబానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించేంతవరకు బి ఆర్ఎస్ పార్టీ వారి కుటుంబం పక్షాన పోరాడుతుందని అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్,సేవ్వా జగదీష్, దాసరి రమేష్, కొత్తపెళ్లి సంతోష్, స్వామి, పోచ్చన్న, బోడ పోచన్న, లచ్చన్న తదితరులు ఉన్నారు,