తనకు విద్య నేర్పిన గురువు కి తన సొంత గ్రామం చలిచీమల పల్లి లో,నివాళ్లు అర్పించిన పూర్వ విద్యార్థులు.
తనకు విద్య నేర్పిన గురువు కి తన సొంత గ్రామం చలిచీమల పల్లి లో,నివాళ్లు అర్పించిన పూర్వ విద్యార్థులు.
నిన్నటి దినం అనారోగ్యం తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన శ్రీ సుబ్రహ్మణ్యం రిటైర్డ్ డిప్యూటీ డి ఈ ఓ,కమ్మతిమ్మయ్య పల్లి ఉన్నత పాఠశాల లో సుదీర్గ కాలం సైన్స్ మాస్టర్ గాను,ప్రధాన ఉపాధ్యాయులుగాను పనిచేసి పదవీ విరమణ పొందారు,ఈ సందర్భం గా కేటీ పల్లి,పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మధుసూదనరావు గారు మాట్లాడుతూ తల్లి తండ్రులు తరువాత గురువే జీవితం లో మరచిపోలేనటువంటి వారని,అందులోనూ ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక దృష్టి సారించి,వారి నడవడిక,క్రమశిక్షణ వంటి వాటి ని చక్కగా నేర్పించిన గురువును మరచి పోలేమని,వారు చూపిన మార్గంలో ముందుకు సాగడం వారి వారి వృత్తులలో ఉన్నత శిఖరాలను చేరుకోవడం లో సుబ్రమణ్యం గారి కృషి మరచిపోలేందని పేర్కొన్నారు,వీరితో పాటుగా పూర్వ విద్యార్థులు ఎలుక వెంకటేష్,టీసీ నంద గోపాల్,ఒబ్బిశెట్టి శేఖర్,వడివేల్,రామలింగం,లక్ష్మి నారాయణ,మహిళా విద్యార్థినులు బుజ్జి,రజని ,రేణుకా మరియు పరిసర గ్రామస్తులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు .