logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బాబా రాందేవ్ సమక్షంలో అనకాపల్లి జిల్లాలో గ్రామీణ విద్యార్థులకు ఉచిత యూపీఎస్సీ, ఐఐటి, నీట్ కోచింగ్ ప్రతిపాదన.

అనకాపల్లి జిల్లా .వారణాసి యాత్ర సందర్భంగా జాతీయ ఓ బి సి అధ్యక్షుడు, వేద విద్యా సంస్థల డైరెక్టర్ పోతల ప్రసాద్ నాయుడు బాబా రాందేవ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనకాపల్లి జిల్లా సమర్పణ ఫౌండర్ కిల్లాడ సత్యనారాయణ ఐపిఎస్ ఆధ్వర్యంలో ఫిజిక్స్ వాలా కోచింగ్ సెంటర్ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఐఐటి, నీట్ కోర్సులకు ఉచిత సదుపాయాలతో శిక్షణ ఇచ్చే కార్యక్రమం గురించి పోతల ప్రసాద్ నేరుగా వివరించారు.అలాగే వేద సంస్థల నుంచి యుపి ఎస్సీ జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను కూడా పంచుకున్నారు. మెరిట్ ఉన్న విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఉచిత యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ కల్పించాలని ప్రతిపాదించారు. తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో ఇలాంటి ఉచిత ఐఐటి, నీట్ కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ చర్చలు యువతకు భవిష్యత్ అవకాశాలను గణనీయంగా పెంచుతాయని పోతల ప్రసాద్ నాయుడు అభిప్రాయపడ్డారు.ఈ ప్రతిపాదనలపై బాబా రాందేవ్ సానుకూల స్పందన తెలిపారు. ప్రతిభ ఉన్న గ్రామీణ విద్యార్థులకు ఉచిత యూపీఎస్సీ, ఐఐటి, నీట్ కోచింగ్ ఇవ్వడం వారి జీవితాలను మార్చే పెద్ద అవకాశమని, ఇలాంటి ప్రయత్నాలు సమాజ పునర్నిర్మాణానికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత కోచింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను తను పూర్తిగా సమర్థిస్తున్నట్లు చెప్పారు.

4
389 views

Comment