logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

🌍 💪ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పి.వి.ఎం నాగజ్యోతి ఎంపిక 💪🌍

హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌ లో 22-03-2026 తేదీన NSPF (నాచురల్ స్ట్రాంగ్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో జరిగిన GPC ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవర్ లిఫ్టర్ పి.వి.ఎం నాగజ్యోతి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రపంచ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. 🏋️‍♀️👏
దీంతో ఆమె అక్టోబర్ 19 నుండి 25 వరకు పోలాండ్ దేశంలోని పబియనీస్ నగరంలో జరగనున్న ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. 🇮🇳✨
పి.వి.ఎం నాగజ్యోతి సాధించిన ఈ విజయంపై క్రీడా ప్రముఖులు, సహచరులు మరియు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు. 🌟

28
1596 views

Comment